ప్రేమలో విఫలం.. చెన్నైలో ఏపీకి చెందిన తమిళ సినీనటి ఆత్మహత్య

  • ‘వైతా’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దీప
  • ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడం వల్లేనంటూ ఆత్మహత్య లేఖ
  • తిరుపతి జిల్లా ఇంద్రానగర్‌లో నేడు అంత్యక్రియలు  
ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తిరుపతికి చెందిన తమిళ సినీనటి పౌలిన్ జెస్సిక అలియాస్ దీప (29) ఆత్మహత్య చేసుకున్నారు. ‘వైతా’ అనే సినిమాలో కథానాయికగా నటించిన దీప.. మరికొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. విరుగంబాక్కంలో తానుండే ఫ్లాట్‌లోనే ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఆమెకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో స్నేహితుడు ప్రభాకరన్ ఆమె ఫ్లాట్‌కు వెళ్లారు. అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించారు. 

దీప మృతి విషయమై ఆమె సోదరుడు దినేష్ శనివారం రాత్రి కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఓ ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన మృతికి ఎవరూ కారణం కాదని, ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో ఉందని పోలీసులు తెలిపారు. దీప సొంత ఊరైన తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని ఇంద్రానగర్‌లో నేడు అంత్యక్రియలు జరగనున్నాయి.

Pauline Jessica
Kollywood
Deepa
Tirupati

More Telugu News